కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ

by Ajay Maddhiboyina |

అక్ర‌మ మైనింగ్ కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏపీ పోలీసులు ఆయ‌న‌ను కేర‌ళ‌లో అదుపులోకి తీసుకున్నారు.

కాకాణి బెయిల్‌ పిటిషన్‌పై నేడు విచారణ
X

దిశ‌, వెబ్ డెస్క్: అక్ర‌మ మైనింగ్ కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్థన్ రెడ్డి అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏపీ పోలీసులు ఆయ‌న‌ను కేర‌ళ‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న బెయిల్ కోసం పిటిష‌న్ వేయ‌గా నేడు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఎస్సీ, ఎస్టీ జిల్లా కోర్టు కాకాణి బెయిల్ పై విచార‌ణ జ‌ర‌ప‌నుంది. మ‌రోవైపు ఇదే కేసులో కాకాణిని క‌స్ట‌డీకి కోరుతూ పోలీసులు పిటిష‌న్ వేశారు.

దీంతో ఎలాంటి తీర్పు వ‌స్తుందా అని ఉత్కంఠ నెల‌కొంది. ఇదిలా ఉంటే కాకాణి క్వార్జ్ అక్ర‌మ త‌వ్వ‌కాలు, ర‌వాణా, నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా పేలుడు ప‌దార్థాల వినియోగంపై ఫిబ్ర‌వ‌రిలో పొద‌ల‌కూరు పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఆ తరవాత కాకాణి అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగుళూరులో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. ఇప్పటికే జైలులో పలువురు వైసీపీ కీలక నేతలు కాకాణితో ములాఖత్ అయ్యారు. కాకానిణి టీడీపీ కుట్ర పూరితంగా అరెస్ట్ చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story