విచారణ అర్హత లేదు.. ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

by Vemula.Srinu Prasad |

మాజీ ఎంపీ రఘురామరామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 13కు హైకోర్టు వాయిదా వేసింది..

విచారణ అర్హత లేదు.. ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ రఘురామరామకృష్ణంరాజు(Former MP Raghurama Ramakrishnam Raju) కస్టోడియల్ టార్చర్ చేసిన కేసు(Custodial Torture Case)లో ఐపీఎస్ సునీల్ నాయక్(IPS Sunil Nayak) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాష్ట్ర హైకోర్టు(High Court)లో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. తాను ఐజీ హోదాలో ఉన్నానని, విచారణకు సహరిస్తానని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఇప్పటికే అరెస్ట్ ప్రక్రియ పూర్తికావడంతో ముందస్తు బెయిల్‌కు ఈ పిటిషనన్ విచారణ అర్హత లేదని తెలిపింది. ఇరువర్గాలు వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

Next Story