చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

by Seetharam |
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు వింది. ఇరువాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

సీఐడీ వాదనలు ఇవే

ఇకపోతే రెగ్యులర్ బెయిల్ రద్దు కేసు విచారణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ధర్మాసనం గతంలోనే నోటీసులు ఇచ్చిందని సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈకేసుపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని వెల్లడించారు. అయితే తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టును కోరారు. దీంతో హరీశ్ సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.



Next Story

Most Viewed