- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu హౌస్ కస్టడీ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
మాజీ సీఎం చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో తీర్పు రేపటికి వాయిదా వేసింది..

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు తీర్పు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం మధ్యాహ్నం కేసు విచారణ చేపడతామని కోర్టు సూచించింది. అయితే ఉదయమే తీర్పు ఇవ్వాలని చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా కోరారు. హౌస్ కస్టడీగా మార్చాల్సిన అవసరం లేదని సీఐడీ తరుఫున వాదనలు వినిపించారు. మరోవైపు హౌస్ కస్టడీపై మూడుసార్లు వాదనలు వినిపించారు. మరోసారి కోర్టుకు రావాలని ఇరువర్గాల లాయర్లకు కోర్టు సూచించింది.
కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైలులో ప్రత్యేక ఖైదీగా చంద్రబాబు రిమాండులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్నారు. అటు సీఐడీ తరఫున కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వస్తుందోనని టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
Next Story






