- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రూప్-2 నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ
రాష్ట్రంలో 2023 సంవత్సరంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్(Group-II Notification)పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు(High Court) విచారించింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో 2023 సంవత్సరంలో జారీ చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్(Group-II Notification)పై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు(High Court) విచారించింది. ఏపీపీఎస్సీ(APPSC) గ్రూప్-2 నోటిఫికేషన్‌లో వికలాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్, క్రీడాకారులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
విచారణ అనంతరం జస్టిస్ సుబ్బారెడ్డి తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కే సబర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా గ్రూప్-2 పోస్టుల భర్తీకి రిజర్వేషన్ల రోస్టర్‌ను ఖరారు చేయాలని ఎం.పార్థసారధి పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-2లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో ఆ రిజర్వేషన్ల కల్పనతో ప్రత్యేక రోస్టర్ ను ఖరారు చేయడాన్ని కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్య, ఇతరులు పిల్ దాఖలు చేశారు.
ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 మెయిన్స్(Group-II Mains) పరీక్షను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. దీనిపై ఎజి.దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తయింది అన్నారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు తీర్పును వాయిదా వేసింది.






