- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టుకు మావోయిస్టుల బంధువులు.. నేడు వర్చువల్ విచారణ
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ళ కేశవరావు, సజ్జా నాగేశ్వరావుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాల పై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విచారణ జరగనుంది.

దిశ, బాపట్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ళ కేశవరావు, సజ్జా నాగేశ్వరావుల మృతదేహాలను తమకు అప్పగించాలని వారి బంధువులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్లో విచారణ జరగనుంది. మృతుల కుటుంబాల తరపున ప్రధానంగా సీనియర్ ఏపీ హైకోర్టు న్యాయవాది ఏ. సత్య ప్రసాద్ తోపాటు విచారణలో వాదనలు వినిపించే న్యాయవాద బృందంలో జై భీమ్ రావు, చిలక చంద్రశేఖర్, డి.సురేష్ కుమార్, వై.కోటేశ్వర్రావు, నంబూరి శ్రీమన్నారాయణ, క్రాంతి, పిచ్చుక శ్రీనివాస్ వున్నట్లు తెలిసింది. ఆన్ లైన్ విచారణ ఈరోజు 11 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈరోజు సెలవు ఐనందున ఆన్ లైన్లో విచారణ జరగనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలలోపు న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రజా సంఘాల ప్రతినిధులు తెలిపారు.
ఇదిలా ఉండగా మృతుల భౌతికకాయాల్ని తమకు అప్పగించాలని ఛత్తీస్ ఘడ్ వెళ్లిన బంధువులు అక్కడే వేచి వున్నారు. నిన్న 14 మృత దేహాలకు పోస్ట్ మార్టం ఐనట్లు తెలిసింది. మిగిలిన మృతదేహాలకు ఈరోజు పోస్ట్ మార్టమ్ జరగనున్నట్లు కూడా తెలిసింది. ఇదిలావుంటే కేశవరావు స్వగ్రామమైన జియన్న పేట (శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం)కి మృతదేహం వస్తే అంత్యక్రియలను జరపడానికి గ్రామస్తులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.






