- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో జీబీఎస్ టెన్షన్.. టెన్షన్: హెల్త్ సెక్రటరీ కీలక ప్రకటన
ఏపీలో టెన్షన్ పెడుతున్న జీబీఎస్ వ్యాధిపై హెల్త్ డిపార్ట్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జీబీఎస్ వ్యాధి(GBS Disease)తో వృద్ధురాలు మరణించారు. గుంటూరు జీజీహెచ్‌లో మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 17 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలోనే నలుగురికి జీబీఎస్ సోకిందని చెప్పారు. దీంతో జీబీఎస్ సోకి జ్వరం, మూర్చతో జనాలు చనిపోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ హెల్త్ డిపార్టుమెంట్ అప్రమత్తమైంది. జీబీఎస్ వ్యాధిపై హెల్త్ సెక్రటరీ కృష్ణబాబు క్లారిటీ ఇచ్చారు. బీబీఎస్ అంటు వ్యాధి కాదని, అలా అని జెనెటికల్ సైతం కాదని ఆయన చెప్పారు. గులియన్ బారే సిండ్రోమ్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి అని తెలిపారు. వ్యాధి కారకాలు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని తెలిపారు. ఒకరకంగా పక్షవాతం లాంటిదన్నారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బీజీఎస్ ఉందన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే జీబీఎస్ వ్యాధి సోకే అవకాశం ఉందని చెప్పారు. 5 నుంచి 7 మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. అప్పటికప్పుడు కాళ్లు చచ్చుబడినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కృష్ణబాబు సూచించారు.






