రాజమండ్రి కల్తీపాల బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-26 05:42:17  IST  )

రాజమండ్రిలో కల్తీపాల కలకలం రేగిన సంగతి తెలిసిందే. తాజాగా చికిత్స పొందుతున్నవారిపై ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

రాజమండ్రి కల్తీపాల బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో కల్తీపాల కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే ఐదుగురు మరణించారు. మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా చికిత్స పొందుతున్నవారిపై ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో 15మంది చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. బాధితులకు చికిత్స కొసం యాంటీడోట్ తెప్పించామని అధికారులు చెబుతున్నారు. పదిహేను మందిలో ఇద్దరు వెంటిలేటర్ పై, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురికి వెంటిలేటర్ పై ఉంచి డయాలసిస్, ఏడుగురికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోశారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పాలు కల్తీ జరిగినట్టు సైతం ప్రాథమికంగా నిర్ధారించారు. పాలు, పెరుగు, బాధితుల రక్త నమూనాలు సేకరించి లేబరేటరీలకు పంపించారు. మరోవైపు పాలవ్యాపారిని సైతం అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story