- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గన్ మిస్ ఫైర్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ మృతి
డోన్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.

దిశ, వెబ్ డెస్క్ : గన్ మిస్ ఫైర్ (Gun Misfire) ఓ హెడ్ కానిస్టేబుల్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. చిన్నపొరపాటు కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఈ హృదయ విదారకరమైన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా సి.బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య (Peddaiah) గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. డోన్ జీఆర్పీ పోలీసు స్టేషన్ (Done GRP Police Station) పరిధిలో పని చేస్తున్నారు. హుబ్లీ నుంచి విజయవాడకు (Hubli To Vijayawada) వెళ్తున్న రైలులో విధి నిర్వహణలో ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తన విధులను ముగించుకున్నారు. గన్ హ్యాండోవర్ (Gun Handover) చేసేందుకు జీఆర్పీ పోలీసు స్టేషనుకు వెళ్లారు. ఈ క్రమంలో గన్ మిస్ ఫైర్ అయ్యి పెద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. తూటా శరీరంలోకి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలను వదిలేశారు. సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.






