- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మళ్లీ సీఎం కుర్చీలో ఆయనే కూర్చుంటారు’.. ప్రముఖ అవధాని సంచలన జోస్యం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Former CM Jagan) తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది(Ugadi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇవాళ(ఆదివారం) ఉదయం 9.30 గంటలకు వైసీపీ కేంద్ర కార్యాలయం(YSRCP Office)లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ప్రముఖ అవధాని నారాయణ(Avadhani Narayana Murti) మూర్తి పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ఏడాది ఎలా ఉండబోతుందో వివరించారు.
అయితే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓడిన వైఎస్ జగన్ ధైర్యంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో ఓడితే చాలా మంది భయపడతారని అన్నారు. మిథునరాశిలో జన్మించిన వైఎస్ జగన్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని, ఈ ఏడాదంతా బాగుంటుందని పేర్కొన్నారు. అలాగే తెలుగు భాష గొప్పతనం గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలు లాగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఇక వైఎస్ జగన్ కుటుంబ సమస్యలు ఈ ఏడాది సమసిపోతాయని చెప్పారు. జగన్ మళ్లీ గెలుస్తారని పేర్కొన్నారు. ఈక్రమంలో ‘మళ్లీ సీఎం కుర్చీలో జగన్ కూర్చుంటారు’ అని అవధాని నారాయణ మూర్తి జోస్యం చెప్పారు.






