- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆయనే నా స్ఫూర్తి’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు(CM Chandrababu) నుంచి స్ఫూర్తి పొందానని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ, ఐటీ, ఫార్మా.. అన్ని రంగాల్లో ఏపీని నెం.1 గా నిలపాలన్నదే మా లక్ష్యమని తెలిపారు.
రాబోయే మూడేళ్లలో ఏపీ(Andhra Pradesh) మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. యువత రాజకీయాల్లోకి రావాలి. టీడీపీ యువత, విద్యావంతులను ప్రోత్సహిస్తుంది అని నారా లోకేష్(Nara Lokesh) తెలిపారు. మహిళా సాధికారత ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. 1992లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ ను తల్లి భువనేశ్వరి(Nara Bhuvaneswari), భార్య బ్రాహ్మణి(Brahmani) సమర్థవంతంగా నిర్మిస్తున్నారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.






