కళ్లు కనిపించడంలేదు కాబట్టే బెయిల్ వచ్చింది: చంద్రబాబుకు బెయిల్‌పై మంత్రి అంబటి సెటైర్లు

by Seetharam |   (  Updated:2023-10-31 15:17:51  IST  )

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కళ్లు కనిపించడంలేదు కాబట్టే బెయిల్ వచ్చింది: చంద్రబాబుకు బెయిల్‌పై మంత్రి అంబటి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు నాలుగువారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పుపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడుతన్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పైనా తీవ్రంగా స్పందించారు.‘నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్లు కనిపించడంలేదు కాబట్టి బెయిల్ వచ్చిందంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చిందని టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతుంటే మంత్రి అంబటి చేసిన ట్వీట్ చిర్రెత్తుకొచ్చింది. దీంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.‘నీకూ కనిపించని రోజు వస్తుంది వెయిట్ చేయండి సర్’ అంటూ అంబటికి సమాధానం ఇచ్చారు. మరోక నెటిజన్ అయితే ‘ప్రూఫ్ ఉండి కాదు జైలులో పెట్టింది.. మీ జగన్ సైకో బుద్ధిని ప్రూఫ్ చేసుకోవడానికి జైలులో పెట్టింది’ అంటూ ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా స్పందించారు.‘జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయింది... పవన్ ఎప్పుడు పరిపక్వమవుతాడో? అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు తెలంగాణలో చేతులెత్తేసిన తెలుగుదేశం... త్వరలో ఏపీలో కూడా అంటూ ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Also Read..

ఓపెన్‌గా మద్దతిచ్చిన పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు: చంద్రబాబు

Next Story