- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బోన్ ఎక్కాడు, బొక్కలోకి కూడా వెళ్లాడు : చంద్రబాబుపై మంత్రి జోగి రమేశ్ ఘాటు విమర్శలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు వేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ బస్సు యాత్రపై మంత్రి జోగి రమేశ్ సెటైర్లు వేశారు. నిజం ఈరోజుకైనా గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు అని అన్నారు. పాపం పండింది, అవినీతి బయటపడింది కాబట్టే బాబు రాజమండ్రి జైల్లో ఉన్నాడని విమర్శించారు. నిజం గెలవాలని కాకుండా చంద్రబాబు పాప పరిహార యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేది అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన పాపాలన్నీ పండాయి కాబట్టే అరెస్టు అయ్యాడు.. బోన్ ఎక్కాడు, బొక్కలోకి కూడా వెళ్లాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాబట్టి పాప పరిహార యాత్ర అని పేరుతో భువనేశ్వరి యాత్ర చేస్తే బాగుంటుందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈనెల 26 నుంచి వైసీపీ చేపట్టబోయే సామాజిక సాధికార బస్సు యాత్ర పోస్టర్‌ను తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ,బీసీ,ఎస్టీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి జోగి రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ మీడియాతో మాట్లాడారు. జగనన్న పరిపాలన జనం మెచ్చిన పరిపాలన అని కొనియాడారు. 77 సంవత్సరాల స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సామాజిక ధర్మాన్ని పాటించలేని పరిస్థితుల్లో ఏపీలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. ముఖ్యమంత్రి నాయకత్వాన్ని పటిష్టపరుస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి పేదలకు – పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై జగనన్నకు అండగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయాన్ని ఆచరణలో చేసి చూపించిన జగనన్నకు అండగా నిలబడదామని జోగి రమేశ్ పిలుపునిచ్చారు.






