అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం: ఇద్దరు కూలీలు మృతి

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలులు, భారీ వర్షం తీవ్ర బీభత్సం సృష్టించాయి. నక్కపల్లి మండలంలో ఒక్కసారిగా వడగళ్ల వాన పడింది..

అనకాపల్లి జిల్లాలో ఈదురుగాలుల బీభత్సం: ఇద్దరు కూలీలు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District)లో ఈదురుగాలులు(Gusty winds), భారీ వర్షం(Heavy Rain) తీవ్ర బీభత్సం సృష్టించాయి. నక్కపల్లి మండలంలో ఒక్కసారిగా వడగళ్ల వాన(Hail) పడింది. దీంతో పలు గ్రామాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు, స్తంభాలు రోడ్లపై అడ్డంగా పడిపోయాయి. ఈ మేరకు గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడింది. నక్కపల్లి మండలంలో ఈదురుగాలుల ధాటికి కూలీలపై కొబ్బరి చెట్టు విరిగిపడింది. దీంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు.

రైతులకు ముంచేసిన అకాల వర్షం

అయితే ఈ అకాల వర్షం అన్నదాతలు నిండా ముంచేసింది. కోతకు సిద్ధంగా ఉన్న మామిడి, అరటి, బొప్పాయి తోటలు ఈదురుగాలుల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు విరిగిపడి, కాయలు రాలిపోవడంతో ఎకరాల కొద్దీ పంట నాశనం అయింది. దీంతో అన్నదాతలు లబో దిబో అంటున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Next Story