- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
New Ration Card:కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారా.. ఈజీగా స్టేటస్ తెలుసుకోండిలా!?
ఏపీ(Andhra Pradesh)లో కొత్త రేషన్ కార్డులకు ఈ నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పేర్కొన్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో కొత్త రేషన్ కార్డులకు ఈ నెలలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల(మే) 8వ తేదీ నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి.. తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక నిన్నటి(మే 15) నుంచి ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. ఈ కొత్త రేషన్ కార్డుల(AP Ration Card) జారీ పై కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉంది. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం.. ఈకేవైసీ(eKYC), VRO, తహసీల్దార్ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ మూడు దశలు పూర్తి కావడానికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల స్టేటస్‌ని(Ration Card Application Status) ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకునే వెసులుబాటును దరఖాస్తుదారులకు ప్రభుత్వం కల్పించింది.
దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోండిలా..
*ఏపీ సేవా అధికారికి పోర్టల్(AP Seva Portal Ration Card) https://vswsonline.ap.gov.in/వెబ్ సైట్‌ని సందర్శించి.. లాగిన్ అవ్వండి.
*వెబ్‌సైట్ లో కుడివైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ కాలమ్ ఉంటుంది.
అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి.
ఆ తర్వాత ఓ కోడ్ వస్తుంది.
*ఆ వివరాలు అందులో నమోదు చేస్తే రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి దగ్గర ఉందో తెలుస్తుంది. న్యూ రేషన్ కార్డు (New Ration Card) జారీ ప్రక్రియ పూర్తి కావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందనే అనే వివరాలు కూడా అందులో కనిపిస్తాయి.






