- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:‘మీకు హ్యాట్సాఫ్ సార్’.. ఇంగ్లీష్ టీచర్ పై మంత్రి లోకేష్ ప్రశంసలు
గురువులు తలుచుకుంటే విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, సమాజాన్ని సైతం కదిలించవచ్చని నిరూపించిన ఘటన ఒకటి ఏపీలో చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: గురువులు తలుచుకుంటే విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా, సమాజాన్ని సైతం కదిలించవచ్చని నిరూపించిన ఘటన ఒకటి ఏపీలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం ZPHS కు చెందిన ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లి ఓ నిరుపేద విద్యార్థికీ బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఫేస్‌బుక్‌లో ఉపాద్యాయుడు శ్రీధర్ పెట్టిన పోస్ట్ చూసి దాతలు రూ.6 లక్షలు అందించారు. ఈ విషయం ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దృష్టికి వెళ్లడంతో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
అంకితభావంతో బోధన, నిస్వార్థ సేవాకార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తోన్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లికి మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు. ప్రమాదానికి గురైన ఓ విద్యార్థి బ్రెయిన్ సర్జరీ కోసం రూ.6 లక్షలు విరాళాలు పోగుచేసి ప్రాణాలు నిలిపిన ఆయనకు హ్యాట్సాఫ్ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఐదుగురు బాలికల ఉన్నత చదువు, ప్రభుత్వ స్కూలులో వసతులు, లైబ్రరీ బుక్స్, మైక్ సెట్, క్రీడాసామాగ్రి కోసం దాతల సహకారంతో లక్షల రూపాయలు సమకూర్చి ప్రభుత్వ విద్యా వికాసానికి దోహదపడిన శ్రీధర్ సార్ స్ఫూర్తిగా నిలిచారు. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆసక్తి గల విద్యార్థులకు స్కూలు సమయం ముగిశాక ఇంట్లో వారికి భోజనం పెడుతూ.. క్లాసులు చెప్పిన శ్రీధర్ మాస్టారుని ఆదర్శంగా తీసుకొని ఏపీ మోడల్ ఎడ్యుకేషన్‌ని దేశానికి దిక్సూచిగా నిలిపేందుకు అంతా కలిసి కృషి చేద్దామని మంత్రి లోకేష్ వెల్లడించారు.






