- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్‌కుమార్ గుప్తా
ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha) పూర్తిస్థాయి డీజీపీగా నియమితులైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జ్ డీజీపీగా ఉన్న హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha) పూర్తిస్థాయి డీజీపీగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల 27న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రెండేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. హరీశ్‌కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)కు చెందిన ఆయన ఖమ్మం ఏఎస్పీగా తన తొలి పోస్టింగ్ పొందారు. మెదక్, పెద్దపల్లిలలో ఏఎస్పీగా సేవలందించారు. అదేవిధంగా కృష్ణా, నల్గొండ జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా కీలక బాధ్యతలు నిర్వహించారు.
గుంటూరు రేంజ్ ఐజీగా, శాంతిభద్రతల విభాగం, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ విభాగం అదనపు డీజీపీగా పనిచేశారు. పోలీసు నియామక మండలి చైర్మన్‌గా, రైల్వే డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2022 మే నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. జనవరి 31న అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో పూర్తి స్థాయి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీనియర్ పోలీసు అధికారులు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అభినందనలు తెలిపారు.






