శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. స్పెషల్ విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-25 09:33:47  IST  )

ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది.

శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. స్పెషల్ విషెస్ చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం సరిగ్గా 12:01 గంటలకు చేపట్టిన ఫాల్కన్‌-9 రాకెట్‌ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌ నుంచి వారి క్యాప్సుల్‌ విడిపోయి ISS దిశగా ప్రయాణం కొనసాగుతోంది. అయితే, యాక్సియం-4కు గ్రూప్ కెప్టెన్‌గా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీ యాత్రకు వెళ్లిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. శుక్లా రోదసీ యాత్ర మన దేశ అంతరిక్ష చరిత్రలో నూతనాధ్యాయమని, భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. స్పేస్‌లో ఇస్రో తరఫున ఆయన ఏడు ప్రయోగాలు చేయబోతున్నారని తెలిపారు. మన దేశం త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్ మిషన్‌కు శుక్లా గడించే అనుభవం కచ్చింతంగా దోహదపడుతోందని అన్నారు.

Next Story