విజయకీలాద్రిపై వైభవంగా హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ

by Naga Rani Yarlagadda |

విజయకీలాద్రిపై హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరుగుతోంది.

విజయకీలాద్రిపై వైభవంగా హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఉన్న విజయకీలాద్రిపై హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగుతోంది. శ్రీ విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠకోసమై అన్ని పూజలను శాస్త్రోక్తంగా.. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చతుస్థానార్చన, మన్యుసూక్తహవనం చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి నిర్వహించి.. ఉదయం 10.55 గంటలకు స్వాతీ నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తంలో త్రిదండి చినజీయర్ స్వామి కర కమలాలతోప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రథమారాధన, తీర్థప్రసాద గోష్టి, విశేష తదీయారాధన కార్యక్రమాలు చేపట్టారు. ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు విజయకీలాద్రికి చేరుకున్నారు. ఆ హనుమంతుడి దివ్యరూపాన్ని చూపి భక్తులు తన్మయత్వం చెందారు.

Next Story