భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత: మంత్రి నారా లోకేష్

by Jakkula.Mamatha |

దేశవ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత: మంత్రి నారా లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 07) జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవం(National Handloom Day) సందర్భంగా చేనేత కార్మికులకు ఏపీ(Andhra Pradesh) విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక చేనేత అని కొనియాడారు. వ్యవసాయం తర్వాత వేలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పింస్తుందన్నారు. అలాంటి రంగానికి అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం నేటి నుంచి ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

Next Story