హంస వాహనంపై సరస్వతీదేవిగా అభయమిచ్చిన శ్రీ మలయప్పస్వామి

by Naga Rani Yarlagadda |

కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.

హంస వాహనంపై సరస్వతీదేవిగా అభయమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విద్యుత్ వెలుగుల్లో స్వామివారు వాహనాలపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ.. అభయమిస్తోంటే.. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ.. అడుగడుగునా హారతులు పడుతున్నారు. భక్తుల నామస్మరణతో తిరుమల గిరులు మారు మ్రోగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ శ్రీ మలయప్పస్వామివారి హంస వాహనంపై సరస్వతిదేవి అలంకరణలో విహరిస్తూ.. భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఊరేగింపు ముందు పడతుల కోలాటాలు, సీతారాముల వేషధారణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.

Next Story