విజయసాయి కుమార్తె నేహా రెడ్డికి బిగ్ షాక్... హైకోర్టుకు పూర్తి రిపోర్టు...!

by Vemula.Srinu Prasad |

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డికి జీవీఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు....

విజయసాయి కుమార్తె నేహా రెడ్డికి బిగ్ షాక్... హైకోర్టుకు పూర్తి రిపోర్టు...!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former Mp Vijayasaireddy) కుమార్తె నేహా రెడ్డి(Neha Reddy)కి జీవీఎంసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె అక్రమంగా నిర్మించిన నిర్మాణంపై పూర్తి రిపోర్టును హైకోర్టుకు సమర్పించనున్నారు. విశాఖ జిల్లా భీమిలిపట్నం(Bheemili) పరిధిలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో నేహారెడ్డి నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారు. అయితే జనసేన నాయకుల ఫిర్యాదుతో నేహారెడ్డి అక్రమ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు(Gvmc Officers) గతంలోనే కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పలుమార్లు ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. అయితే అక్రమ నిర్మాణాలు చేపట్టిన నేహారెడ్డితో పాటు ఇతర బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారని గత విచారణలో జీవీఎంసీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని నిలదీసింది. పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.

అయితే ఇదే అంశంపై త్వరలో హైకోర్టులో విచారణ జరగనుంది. నేహారెడ్డి అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ అధికారులు పూర్తి రిపోర్టును రెడీ చేశారు. సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ మేరకు నేహా రెడ్డి అక్రమాలపై వివరాలతో కూడిన పూర్తి రిపోర్టును హైకోర్టుకు సమర్పించనున్నారు. దీంతో విజయసాయిరెడ్డి అనుచరులు, గతంలో ఆయనతో పని చేసిన వైసీపీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది.

కాగా భీమిలి బీచ్ వద్ద సీఆర్జెడ్ ప్రాంతంలో సముద్రానికి అతి దగ్గరలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణాన్ని విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేపట్టారు. అయితే సముద్ర తీర ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోలేదని, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్(Jana Sena Corporator Pithala Murthy Yadav) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు.. అక్రమ నిర్మాణాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది. దీంతో నేహారెడ్డి ఆక్రమిత స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పర్యవరణ అనుమతులు లేవని తేల్చారు. మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది.

Next Story