కేదార్‌నాథ్‌లో GVMC బిల్ కలెక్టర్ పాలవెల్లి మృతి

by Gantepaka Srikanth |

కేదార్‌నాథ్‌(Kedarnath)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కుటుంబంతో సహా కేదార్‌నాథ్‌కు వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన జీవీఎంసీ బిల్ కలెక్టర్ పాలవెల్లి(GVMC Bill Collector Palavelli) మృతిచెందారు.

కేదార్‌నాథ్‌లో GVMC బిల్ కలెక్టర్ పాలవెల్లి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కేదార్‌నాథ్‌(Kedarnath)లో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. కుటుంబంతో సహా కేదార్‌నాథ్‌కు వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన జీవీఎంసీ బిల్ కలెక్టర్ పాలవెల్లి(GVMC Bill Collector Palavelli) మృతిచెందారు. సోమవారం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబసభ్యులు వెంటనే రుద్ర ప్రయాగ ఆసుపత్రిలో చేర్పించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి గాజువాకకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మరణవార్త తెలిసిన జీవీఎంసీ సిబ్బంది సంతాపం తెలుపుతున్నారు.

Next Story