గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

by Naga Rani Yarlagadda |

కోల్‌కతా నుంచి నాగర్ కోయిల్ (Kolkata to Nagar Coil) కు వెళ్తున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌ (Gurudev Express)కు విశాఖలో తృటిలో పెనుప్రమాదం తప్పింది.

గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా నుంచి నాగర్ కోయిల్ (Kolkata to Nagar Coil) కు వెళ్తున్న గురుదేవ్ ఎక్స్‌ప్రెస్‌ (Gurudev Express)కు విశాఖలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఎస్ 11 బోగీలో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు. సమయానికి ప్రమాదాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని, లేకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉందని ప్రయాణికులు వాపోయారు.

ఇటీవల కాలంలో ఇలాంటి రైలు ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో.. రైల్వేశాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని రైళ్లలో సేఫ్టీ ప్రికాషన్స్ పై దృష్టి పెట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story