- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. సోదరిని లవ్ మ్యారేజ్ చేసుకున్న యువకుడి హత్య
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుడిని మరో యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు.

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుడిని మరో యువకుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. జిల్లాలోని ఏటుకూరు రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. కొలకలూరుకు చెందిన యువతిని.. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న గణేష్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గుంటూరులోని నల్లపాడు పోలీసుల్ని ఆశ్రయించారు.
పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి మాట్లాడి, దంపతులను వారితో పంపారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో.. గణేష్ పై యువతి సోదరుడు తన స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. నడిరోడ్డుపై విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. అన్ని గొడవలు సద్దుమణిగాయని భావిస్తున్న క్రమంలో తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారంటూ.. గణేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






