Palnati Pourusham: బాలకృష్ణ యాక్షన్.. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రియాక్షన్..!.. వార్నింగ్‌కు తీవ్రస్థాయిలో కౌంటర్

by Disha Web Desk 16 |
Palnati Pourusham: బాలకృష్ణ యాక్షన్.. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రియాక్షన్..!.. వార్నింగ్‌కు తీవ్రస్థాయిలో కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కోటప్పకొండ తిరునాళ్లలో జరిగిన సంఘటనపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంతేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తనను హెచ్చరించడానికి బాలకృష్ణ ఎవరని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు బాలయ్యకు ఏం పని అని నిలదీశారు. ‘నువ్వు హీరో అయితే నీ పార్టీకి గొప్ప.. నాకు కాదు. నరసరావుపేటలో జరిగిందానిపై చర్చిద్దామా?. ఓ పనికి మాలిన వెధవకి ఒత్తాసు పలికి స్థాయి దిగజార్చుకోవద్దు. మనుషులకు మూడు కన్నులు ఉండవు.’ అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

బాలకృష్ణ పాటపై వైసీపీ ఆగ్రహం

కాగా నరసరావుపేట నియోజకవర్గంలో శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ పాటకు వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి డ్యాన్స్ చేశారు. దీంతో మిగిలిన కార్యకర్తలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన.. భాస్కర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు తీవ్ర స్థాయిలో మందలించారు. ఈ ఘటనతో మనస్థాపానికి గురైన వైసీపీ కార్యకర్త భాస్కర రెడ్డి.. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

సినిమాలు, రాజకీయాలు వేర్వేరు..

అయితే ఈ విషయాన్ని గుంటూరు జిల్లా తెనాలి పర్యటనలో ఉన్న బాలకృష్ణకు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే గోపిరెడ్డిపై బాలకృష్ణ మండిపడ్డారు. సినిమాలు, రాజకీయాలు వేర్వేరు.. రెండింటికి ముడిపెట్టొద్దని హితవు పలికారు. మళ్లీ పునరావృతం అయితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ‘జాగ్రత్త.. హెచ్చరిస్తున్నా... చిటిక వేస్తే చాలు.. మూడో కన్ను తెరిస్తే చాలు’ అంటూ డైలాగ్ చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై నరసరావు‌పేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కూడా అంతేస్థాయిలో స్పందించారు.


Next Story