- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరావతికి ప్రజాధనం భారీగా వృథా: సజ్జల సంచలన వ్యాఖ్యలు
రూ. 2400 కోట్లతో అమరావతి అభివృద్దికి రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: రూ. 2400 కోట్లతో అమరావతి(Amaravati) అభివృద్దికి రాష్ట్ర కేబినెట్(Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(Former government advisor Sajjala Ramakrishna Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని రాజధాని కోసం భారీగా వృథా చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. సెక్రటేరియట్ బిల్డింగ్ అద్ధాల కోసం రూ. 2400 కోట్లు కేటాయించడమేంటని సజ్జల ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల కోసం డబ్బులు లేవంటున్నారని, కానీ భవనాల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. అమరావతి భవన నిర్మాణాలను తన సంపద సృష్టికి చంద్రబాబు వాడుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. కృష్ణా నదిలా చంద్రబాబు భ్రమరాతికి నిధులు పారుతూనే ఉంటాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు పని కొచ్చే పనులపై కేబినెట్ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయన్నారు. మెడికల్ కాలేజీలకు డబ్బులు లేవని ప్రైవేటుకు అప్పగించారని విమర్శించారు. దోచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్లు మంచి వాళ్లు అని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. భూములు దోచుకునే బరితెగింపు మరింత దశకు చేరుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






