- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: వైసీపీకి మరో షాక్... దస్తగిరి రాజీనామా
వైసీపీకి వినుకొండకు చెందిన కీలక నేత దస్తగిరి రాజీనామా చేశారు...

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ముఖ్య నేతలు వైసీపీ(Ycp)కి గుడ్ బై చెప్పారు. వైసీపీలో నెంబర్ టు గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా ఇటీవల రాజీనామా చేశారు. మాజీ మంత్రి శైలాజానాథ్(Former Minister Sailajanath) పార్టీలో చేరికతో అనంతపురం జిల్లా సింగనమల(Singanamala) నియోజకవర్గంలో పార్టీకి బలం పెరుగుతున్న వేళ వినుకొండ(Vinukonda) నియోజకవర్గంలో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు.
పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి(Vinukonda Municipal Chairman Dr. Dastagiri) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సతీమణితో పాటు వినుకొండ 30వ వార్డు కౌన్సిలర్ షకీల్ సైతం వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు ఆ లేఖలను జగన్‌కు పంపారు. అయితే దస్తగిరి దంపతులు త్వరలో టీడీపీ(Tdp)లో చేరబోతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు(Government Chief Whip GV Anjaneyu) సమక్షంలో సైకిల్ ఎక్కబోతున్నారు. ఈ పరిణామంతో వినుకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లైంది. పార్టీ ఓటమితో వినుకొండలో వైసీపీ చేపట్టిన కార్యక్రమాలు కూడా పెద్దగా లేకపోవడం, పార్టీ ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడు పూర్తిగా సెలైంట్ అవడంతో మిగిలిన నేతలు, కార్యకర్తలు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి వినుకొండ నియోజకవర్గంపై వైసీపీ అధినేత జగన్ దృష్టి సారించి, పార్టీ నేతలు, కార్యకర్తల్లో భరోసా నింపాల్సిన అవసరం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.






