- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Janasena: పవన్ అధ్యక్షతన కీలక సమావేశం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. టీడీపీ పొత్తు, ఉమ్మడి కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు చేయాల్సిన కృషిపై పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా చర్చిస్తున్నారు. అధికార పార్టీ అరాచకాలు, వ్యూహాలను ఎలా తిప్పి కొట్టాలనే అంశాలపై చర్చిస్తున్నారు.
కాగా వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఉమ్మడి కార్యచరణ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జులు, మహిళా సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులు, సంయుక్త కార్యదర్శులు హాజరయ్యారు. ప్రస్తుతం పవన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ తర్వాత పవన్ కల్యాణ్ ఏం చెబుతారనే ఉత్కంఠ మిగిలిన పార్టీల నేతల్లో నెలకొంది.






