24 గంటల పరుగుపందెంలో వినుకొండవాసి విజయం

by Thanuru Gopichand |

అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్న అబ్దుల్లా.

24 గంటల పరుగుపందెంలో వినుకొండవాసి విజయం
X

దిశ, వినుకొండ : న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో జరిగిన 24 గంటల జాతీయస్థాయి పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ వాసి, జాతీయ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈనెల 24వ తేదీన ఉదయం 7 గంటలకు మొదలై మరుసటి రోజు 25న ఉదయం 7 వరకు జరిగిన 24 గంటల పరుగు పందెం దిగ్విజయంగా పూర్తి చేసి మెడల్ సాధించారు. ఇదే ఏడాది జూన్ 13న బెంగళూరు కాంతిలాల్ స్టేడియంలో జరగబోయే 24 గంటల పరుగు పందెంలో పాల్గొననున్నారు. 225 కిలోమీటర్ల అర్హత సాధించి త్వరలో జపాన్ లో కూడా జరగబోయే 24 గంటల ప్రపంచ ఛాంపియన్ షిప్ కోసం మన దేశం నుంచి క్వాలిఫై రేస్ లో ఉన్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాను పట్టణంలోని యస్.బి.జే జ్యూయలరీ మార్ట్ ఎన్నార్టీ బాజీ, జూనియర్ కాలేజ్ కరిముల్లా మాస్టర్, జూనియర్ కాలేజ్ తోట నరసింహారావు, లాయర్ సతినేని మహేష్ ప్రత్యేకంగా అభినందించారు. తమవంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని క్రీడాకారులు, ప్రముఖులు, మిత్రులు అబ్దుల్లాను అభినందించారు.

Next Story