మా రాజీనామాలను ఆమోదించండి: చైర్మన్‌ను కోరిన ఎమ్మెల్సీలు

by Vemula.Srinu Prasad |

తమ రాజీనామాలను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు కోరారు.

మా రాజీనామాలను ఆమోదించండి: చైర్మన్‌ను కోరిన ఎమ్మెల్సీలు
X

దిశ, వెబ్ డెస్క్: తమ రాజీనామాలను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును వైసీపీని వీడిన ఇద్దరు ఎమ్మెల్సీలు కోరారు. ఫిరాయింపులపై వైసీపీ చేసిన ఫిర్యాదుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ చేపట్టారు. ఈ విచారణకు ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. ఎమ్మెల్సీలతో చైర్మన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. రాజీనామాలపై వివరణ అడిగి తీసుకున్నారు. తమపై ఎవరైనా ఒత్తిడి ఉందా అని ప్రశ్నించారు. తమపై ఎవరి ఒత్తడి లేదని వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మరో ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ సైతం తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. మొత్తం ఐదుగురు రాజీనామాలు చేసిన నేపథ్యంలో మరో ఇద్దరిని మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారించాల్సి ఉంది.. చూద్దాం ఏం జరుగుందో..

Next Story