- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో 16 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ పరిపాలన విభాగంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న బి.రమ్య కీర్తనను నరసరావుపేట మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు. వినుకొండ మున్సిపాలిటీలో మేనేజర్‌గా ఉన్న కే.అర్జునరావును దర్శి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్న సి.ముని కుమార్‌ను అదే మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్‌గా నియమించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఎం.సుభాష్ చంద్రబోస్‌ను వుయ్యూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించగా, అక్కడి కమిషనర్ జె.రామారావును తెనాలి మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (సౌత్) జోనల్ కమిషనర్‌గా పీవీవీడీపీ ప్రసాద్ రావును నియమించగా, మల్లయ్య నాయుడును గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు.
గుంటూరులో అదనపు కమిషనర్‌గా ఉన్న ఓబులేసును కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. అక్కడి కమిషనర్ విశ్వనాథ్‌ను తదుపరి పోస్టింగ్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కె.లోకేశ్వర వర్మను చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యదర్శిగా, వి.చిట్టిబాబును పళమనేరు–కుప్పం–మదనపల్లె అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న డి.భవాని బాబును తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన జి.శ్రీనివాస్‌ను పుట్టపర్తి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. అక్కడి కమిషనర్ వి.క్రాంతి కుమార్‌ను హిందూపూర్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. అదోని మున్సిపాలిటీలో రెవెన్యూ ఆఫీసర్‌గా ఉన్న ఎస్.బేబీని ఆత్మకూరు (కె) మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జి.రవిని ఎంఈపీఎంఏ ప్రధాన కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమించారు. యేలేశ్వరం నగరపంచాయతీ మేనేజర్ ఏ.ఎన్.జ్ఞానప్రకాశ్‌ను అదే నగరపంచాయతీ కమిషనర్‌గా నియమించారు.






