- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ ఫ్లెక్సీలు చించివేత...గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా పెద్దకూరపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా పెద్దకూరపాడు(Peddakurapadu)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు(Former MLA Nambur Shankar Rao) కార్యాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. సంక్రాంతి(Sankranti) సందర్భంగా ఏర్పాటు ఫ్లెక్సీలను చించివేశారు. అడ్డుకోబోయిన కార్యాలయం సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నరేందర్ అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నంబూరు శకంర్ రావు కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. మళ్లీ ఉద్రిక్తలు పునరావృతం కాకుండా పటిష్ట నిఘా పెట్టారు.
మరోవైపు ఈ దాడిని వైసీపీ నాయకులు ఖండించారు. అధికార పార్టీ కార్యకర్తలే చేశారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు మరింత పెరిగాయని, పరిస్థితులు ఇలాలనే ఉంటే తామూ తిరగబడతామని మాజీ మంత్రి అంబటి హెచ్చరించారు. ఇప్పటికే చాలా సహించామని, ఇక నుంచి ఒప్పుకోమన్నారు. అధికారం ఉందని, మిడిసిపడితే మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. తమకూ సమయం వస్తుందని, అప్పుడు రిటర్న్ గిఫ్టులు ఉంటాయని అంబటి వార్నింగ్ ఇచ్చారు.






