Breaking: ఒక్క రోజు ముందే అమరావతిలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-24 14:49:02  IST  )

అమరావతిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ధరణికోటలో పర్యటించనున్నారు...

Breaking:  ఒక్క రోజు ముందే అమరావతిలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ధరణికోటలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసీపీ ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. తమ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతల పర్యటనలను తాము అడ్డుకోలేదని, కానీ అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం తమ నాయకుడి పర్యటనలను అడ్డుకుంటోందని మండిపడుతున్నారు. ఇటీవలే అమరావతిలో టీడీపీ, వైసీపీ నేతల సవాళ్ల పర్వం ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు పర్యటన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Janasena: జనసైనికులకు పవన్ కల్యాణ్ బహిరంగ సందేశం

Next Story