- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
15న వైసీపీ ర్యాలీలు... జిల్లా కేంద్రాలకు రావాలని శ్రేణులకు పిలుపు
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని పార్టీ ప్రజా ప్రతినిధులకు వైసీపీ పిలుపునిచ్చింది. ...

దిశ, వెబ్ డెస్క్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ(Medical Colleges Privatization)ను వ్యతిరేకిస్తూ వైసీపీ(Ycp) రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు(Rallies) నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో ఈ ర్యాలీలను నిర్వహించాలని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టి ఉద్యమం చివరి దశకు చేరుకుందన్నారు. గ్రామాలు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించామని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించామని తెలిపారు. అంతేకాదు కోటి సంతకాల సేకరణ కూడా చేపట్టామని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రతులను జిల్లా కేంద్రాలను పంపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించిన తర్వాత ఆ ప్రతులను ప్రత్యేక వాహనంలో గవర్నర్ వద్దకు పంపుతామని చెప్పారు. సొంత కార్యక్రమంలా భావించి 15న జిల్లా కేంద్రాల్లో చేపట్టే ర్యాలీల్లో పాల్గొనాలని సజ్జల పిలుపునిచ్చారు.






