- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా కూలీ ఇంట్లో కోట్ల విలువైన బంగారం... షాకైన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
రోజువారి మహిళా కూలీ ఇంట్లో రూ. 1.5 కోట్లు విలువైన బంగారం, వెండి, నగదు చూసి తనిఖీలకు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: రోజువారి మహిళా కూలీ ఇంట్లో రూ. 1.5 కోట్లు విలువైన బంగారం(Gold), వెండి(Silver), నగదు(Cash)ను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా(Guntur District) తెనాలి(Tenali)లో జరిగింది. తెనాలి మహేంద్రకాలనీకి చెందిన మహిళా కూలీ గురవమ్మ ఇంట్లో రైస్ పుల్లింగ్ జరుగుతుందని పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఆ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 800 గ్రాముల బంగారం, 13 కేజీల వెండి, రూ. 5 లక్షల 65 వేల నగదును గుర్తించారు. ఈ సొత్తంతా విజయవాడ చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసే తన అల్లుడిదని గురవమ్మ తెలిపారు. భర్తతో కలిసి గురవమ్మ హోటళ్లకు పొట్టు సరఫరా చేస్తూ నివాసం ఉంటున్నారు. ఇంత సొత్తు ఎక్కడి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో గురవమ్మ అల్లుడు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. రైస్ ఫుల్లింగ్ విషయంలో పలు అనుమానాల నేపథ్యంతో పాటు గురవమ్మ అల్లుడు ఏం చేశాడు. బంగారం ఎలా వచ్చింది. ఎందుకు దాచి పెట్టారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోజువారి కూలీ ఇంట్లో రూ. 1.5కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు పట్టుబడటంతో జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.






