- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధానిలో కీలక ఘట్టం.. హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
ఏపీ రాజధాని నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(AP Capital) నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం(Government) తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త భవనాలకు శంకుస్థాపనలు(Foundation stones) చేస్తోంది. అలాగే త్వరిగతిన పనులను అయిపోయేలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు చేతులు మీదుగా పలు భవనాలకు శంకుస్థాపనలు జరిగాయి. మరికొన్ని భవనాల నిర్మాణ పనులు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయి. ఇటీవలె సీఆర్డీఏ భవనం పూర్తి అయి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమరావతిలో మరో కీలక ఘట్టం నమోదు అయింది. హైకోర్టు(High Court) నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు(Raft foundation works) ప్రారంభమయ్యాయి. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం జరుగుతోంది. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ నిర్మాణం పూర్తి అయితే మరో ఐకానిక్ భవనం రాజధానిలో కనిపించనుంది.






