- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ‘పెద్ది’ సినిమా టికెట్ ధరలు పెంపు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' సినిమా. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది' సినిమా. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌కు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలైన మొదటి వారం లేదా పది రోజుల పాటు అదనపు ధరలతో పాటు రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది.
ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే ప్రత్యేక ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ. 600గా నిర్ణయించారు. ఆ తర్వాత సాధారణ రోజుల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై రూ. 100, అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చు..
మరోవైపు తెలంగాణలో మాత్రం 'పెద్ది' చిత్రానికి టికెట్ ధరల పెంపు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రేట్ల పెంపుదలపై కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ ఆలస్యం అవుతుండటంతోఈ సినిమా విడుదలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీనివల్ల నైజాం ప్రాంతంలో ఈ సినిమా సాధారణ ప్రభుత్వ ధరలతోనే విడుదల కానున్నట్లుగా సమాచారం.






