ఏపీలోని 175 నియోజకవర్గాలకు ర్యాంకులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-09 09:42:48  IST  )

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది...

ఏపీలోని 175 నియోజకవర్గాలకు ర్యాంకులు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వ తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu ) ఫోకస్ పెట్టారు. ఈమేరకు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించారు. ప్రభుత్వం పథకాల అమలు, ఫైల్స్ క్లియరింగ్, శాసనసభ్యుల పని తీరు, పట్టణ, గ్రామాల్లో ప్రగతి, గతం, ప్రస్తుత పరిస్థితులపై సర్వే నిర్వహిస్తుంటారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటారు. అనంతరం ర్యాంకులు ప్రకటిస్తారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంట్ నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించిన ఆయన తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించారు. వివిధ అంశాల్లో 175 నియోజకవర్గాలకు ర్యాంకులు ప్రకటించారు. వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాంకులు వెల్లడించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఏ ప్లస్‌లో 21 నియోజకవర్గాలు కాగా వీటిలో ఏ గ్రేడ్‌లో 153 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక బీ గ్రేడ్‌లో ఒక నియోజకవర్గం మాత్రమే ఉండటం విశేషం. 90 శాతం పైగా మార్కులతో ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన 13 నియోజకవర్గాలు ఉండగా 93 మార్కులతో నంబర్‌ వన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉంది. 92 మార్కులతో గాజువాక రెండో ర్యాంక్‌ సాధించింది. కాకినాడ నియోజకవర్గం 3వ ర్యాంక్‌ సాధించగా విజయవాడ తూర్పు 4వ ర్యాంక్‌‌గా నిలిచింది. ఈ ర్యాంకుల ఆధారంగా మున్ముందు పని తీరును మరింత కనబర్చాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story