- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో 10 కరోనా కేసులు.. మొత్తం 49కు చేరిక
రాష్ట్రంలో శనివారం మరో 10 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కు చేరింది. గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ..

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో శనివారం మరో 10 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 49కు చేరింది. గుంటూరు జిల్లాలో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 302 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, నమోదైన మొత్తం కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 11 కేసులు ఉన్నాయి. గుంటూరులో 9, వైఎస్సార్ కడపలో 8, విశాఖపట్నంలో 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కాకినాడ, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో రెండేసి కేసులు నమోదుకాగా, మరికొన్ని జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున గుర్తించారు.
ప్రస్తుతం కరోనా బాధితుల్లో 24 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 16 మంది ఇంటి వద్దే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు, ఏలూరు జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారిలో ముగ్గురు వైఎస్సార్ కడప జిల్లాకు, ఒకరు కాకినాడ జిల్లాకు చెందినవారు.
నిఘా మరింత కట్టుదిట్టం
కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి నిఘాను వైద్యారోగ్య శాఖ మరింత పటిష్ఠం చేసింది. పాజిటివ్‌గా తేలిన వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, వారి సన్నిహితులను గుర్తించి పరీక్షలు నిర్వహించే చర్యలను జిల్లా సత్వర స్పందన బృందాలు చేపట్టాయి. అనుమానితులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక పడకలు, మందులు, రక్షణ పరికరాలు, పరీక్ష కిట్లు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ నెల 10న అన్ని జిల్లాలను అప్రమత్తం చేసిన వైద్యారోగ్య శాఖ, 18న జిల్లా వ్యాధి నిఘా బృందాలతో సమీక్ష నిర్వహించి కేసుల గుర్తింపు, పరీక్షలు, బాధితుల పర్యవేక్షణ, చికిత్స ఏర్పాట్లపై నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.






