- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. పోలీసులకు కంప్లైంట్
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వేదికగా కుట్రపూరిత విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ డిమాండ్ చేశారు. ..

దిశ, గుంటూరు ప్రతినిధి: వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వేదికగా కుట్రపూరిత విధానాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనార్టీస్ కమిటీ చైర్మన్ నసీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉన్న సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి స్థానాన్ని దిగజార్చే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు కత్తి ఉంచుతూ నేరాలు చేస్తున్నట్లు ఫోటోలు మార్ఫింగ్ చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని వివరించారు. వైసిఒపీ అనుకూల మీడియాను అడ్డుపెట్టుకొని గతంలోనూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నారాసుర రక్త చరిత్ర అంటూ కల్పిత కథనాలు ప్రచురించారని గుర్తు చేశారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన వెంటనే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుపై నెపం వేస్తూ వేశారని పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలకు తెలిసిందని వివరించారు. రాష్ట్రంలోని వైసీపీ పసలేని పార్టీ కావడంతో ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని వదలకూడదని, కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ను ఎమ్మెల్యే నసీర్ కోరారు






