Chandrababu: అమర్‌నాథ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-06-19 13:30:17  IST  )

బాపట్ల జిల్లాలో వైసీపీ కార్యకర్త చేతుల్లో సజీవ దహనమైన బాలుడు అమర్‌నాథ్ కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలిచారు....

Chandrababu: అమర్‌నాథ్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లాలో వైసీపీ కార్యకర్త చేతుల్లో సజీవ దహనమైన బాలుడు అమర్‌నాథ్ కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు అండగా నిలిచారు. వారిని పరామర్శించి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ మేకు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెం వెళ్లిన చంద్రబాబు.. బాలుడు అమర్‌నాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు వద్ద అమర్‌నాథ్ కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

కాగా తన అక్కను వేధించొద్దన్నందుకు బాలుడు అమర్‌నాథ్‌ను వైసీపీ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ట్యూషన్‌కు వెళ్తున్న బాలుడిని వెంకటేశ్వర రెడ్డి ముగ్గురు స్నేహితులతో వెళ్లి కొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ నెల 16న ఘటన జరిగింది. దీంతో అమర్ నాథ్ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read...

Mangalagiri: చంద్రబాబు నోట కొత్త మాట.. పార్టీ నేతలకు కీలక సూచనలు

Next Story