Tadepally: ఓ వైపు పుణ్య స్నానాలు.. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు

by Vemula.Srinu Prasad |

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తాడేపల్లి పుష్కర ఘాట్లు మారాయి....

Tadepally: ఓ వైపు పుణ్య స్నానాలు.. మరోవైపు అసాంఘిక కార్యకలాపాలు
X

దిశ, వెబ్ డెస్క్: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తాడేపల్లి పుష్కర ఘాట్లు మారాయి. ఇటీవల కాలంలో ప్రేమ జంటలు బరి తెగిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పుష్కర ఘాట్లలో విచ్చలవిడి కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. దీంతో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారంటూ అసమనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద చోటు చేసుకుంది.

శివరాత్రి సందర్భంగా బుధవారం పుణ్య స్నానాలు ఆచరించడానికి భారీగా భక్తులు పుష్కరఘాట్ల వద్దకు వెళ్లారు. అయితే ఆసమయంలో వారికి ప్రేమ జంటలు స్వాగతం పలికాయి. పుష్కర ఘాట్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ కనిపించారు. దీంతో భక్తులు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అతి జుగుప్సాకరంగా ప్రేమ జంటలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి మరోసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు స్థానికులు సైతం కోరుతున్నారు. రాత్రి సమయంలోనూ ప్రేమ జంటలు వస్తున్నాయని, ఇలాంటి సమయంలో దారుణాలు కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. గతంలో ప్రేమజంటలపై దాడులు జరిగిన ఘటనలను కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా పుష్కర ఘాట్ల వద్ద పోలీసుల హెచ్చరిక బోర్డులు పెట్టాలని అంటున్నారు. చూడాలి పోలీసుల స్పందన ఎలా ఉంటుందో..!

Next Story