- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెత్త నుంచి సంపద తయారీ.. ఎలా చేస్తారంటే..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని వినియోగంలోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టింది.

దిశ, కారంపూడి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని వినియోగంలోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. చిట్టడవులను తలపిస్తున్న సంపద కేంద్రాలను శుభ్రం చేసి రంగులు వేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించి వాటిని తడి,పొడి చెత్తను వేరు చేస్తున్నారు. వానపాములను వదిలి వర్మీ కంపోస్టు తయారీకి అడుగులు వేశారు. దీంతో గ్రామాల్లో చెత్త సమస్య తొలగడంతోపాటు ఆదాయ వనరు ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
చెత్త రహితంగా గ్రామీణ రోడ్లు
అన్ని గ్రామాల్లో చెత్త సంపద కేంద్రం వినియోగంలోకి తీసుకు వస్తున్నారు . రాష్ట్ర ప్రభుత్వం వీటి మరమ్మతులకు ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కారం పూడి మండలంలోని చెత్త సంపద కేంద్రాలన్నింటిని వినియోగంలోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే రెండు, మూడు మినహా అన్నింటికి రంగులు వేయించారు. మూడు గ్రామాల్లో సంపద కేంద్ర నిర్మాణానికి స్థలం లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. చిన్న గార్ల పాడు గ్రామంలో సంపద కేంద్రం ఉన్నా నీటి వసతి లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నది. ఇప్పటికే పలు కేంద్రాల్లో తడి, పొడి చెత్త వేరు చేసివర్మీ కంపోస్టు తయారు చేసేలా వానపాములు వేసి వినియోగంలోకి తీసుకువస్తున్నారు. దీనితో గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా చెత్త లేకుండా స్వచ్ఛ గ్రామాలుగా నిలుస్తున్నాయి.
ఏప్రిల్ చివరినాటికి పూర్వవైభవం తీసుకువస్తాం
కారంపూడి మండలంలో రెండూ, మూడు మినహా 12 సంపద కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలకు పూర్వవైభవం తీసుకువస్తాం. ఈ నెల చివరి కల్లా అన్ని సంపద కేంద్రాలలో తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుండి వర్మి కంపోస్టు తయారీ సంపద సృష్టిస్తాం. ఇప్పటికే మరమ్మతులు, కలర్ల అద్దకం పూర్తి అయింది. గ్రామాల్లోనూ రోడ్లపై చెత్త లేకుండా శుభ్రంగా మారుస్తు్న్నాం.
-కషిణ్యా నాయక్, ఈఓపీఆర్డీ కారంపూడి






