రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగాలు.!

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. దీంతో 39 వేల మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. .

రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగాలు.!
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. దీంతో 39 వేల మందికి ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. అలాగే విశాఖలో రూ. లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు శ్రీసత్యసాయి జిల్లాలో రూ. 51 వేల కోట్లతో సోలార్ పవన్ ప్లాంట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కడపలో రూ. 12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్‌కు ఏర్పాట్లు చేయనుంది. అటు తిరుపతిలో రూ. 2500 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుల తయారీ పరిశ్రమకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించి పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్నారు.

Next Story