Breaking: మాచర్లలో 144 సెక్షన్.. హై అలర్ట్

by Vemula.Srinu Prasad |

పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ అమలు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమత్తమయ్యారు...

Breaking: మాచర్లలో 144 సెక్షన్.. హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా మాచర్లలో 144 సెక్షన్ అమలు కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమత్తమయ్యారు. పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. మాచర్లకు పిన్నెల్లి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మాచర్ల నియోజకవర్గవ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలవుతోంది. శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు గుంపులుగా తిరగరాదని ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలకు కూడా అనుమతులు నిరాకరించారు. పిన్నెల్లి రాకతో ఆయన అభిమానులు, కార్యకర్తలు చేపట్టే ర్యాలీలు, ఊరేగింపులకు సైతం ఎలాంటి అనుమతి లేదని లేవన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

98 రోజుల తర్వాత విడుదల

కాగా గుండ్లపాడులో జరిగిన జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదల అయ్యారు. సుమారు 98 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా పిన్నెల్లి ఉన్నారు.

Next Story