సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ భారీ మోసం.. బాధితుల సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2025-02-09 12:06:45.0  )
సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ భారీ మోసం.. బాధితుల సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ ఘరానా మోసానికి పాల్పడింది. స్థానికుల నుంచి చిట్టీలు కట్టించుకుని బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. పాలడుగు పల్లారావు అనే వ్యక్తికి తాము చిట్టీలు కట్టామని తెలిపారు. దాదాపు రూ.100 కోట్లకు పైగా చిట్టీలు కట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబుకు మొర పెట్టుకున్నారు. లేనిపక్షంలో అందరూ కలిసి పోరాడాలని బాధితులు నిర్ణయించుకున్నారు.

అయితే పుల్లారావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించారు. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో చిట్ ఫండ్ కంపెనీ లావాదేవీలను నిలిపివేయాలని నరసరావుపేట బ్యాంకులను ధర్మాసనం ఆదేశించింది. సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో సోదాలు చేసి కార్యాలయాన్ని పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.

Next Story

Most Viewed