- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
C-DAC: గన్నవరంలో రూ. 200 కోట్లతో ‘సి-డాక్’ కేంద్రం!
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ 13వ కేంద్రం త్వరలో గన్నవరంలో ఏర్పాటు కానుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే ప్రతిష్టాత్మకమైన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) 13వ కేంద్రం త్వరలో గన్నవరంలో ఏర్పాటు కానుంది. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గత మూడు నెలలుగా చేసిన కృషి ఫలించింది. విజయవాడలో సి-డాక్ ప్రతినిధి బృందంతో ఆయన జరిపిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయని సమాచారం.
ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పనిలేకుండా, కేంద్ర ప్రభుత్వమే నేరుగా సుమారు రూ. 200 కోట్లు కేటాయించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సి-డాక్.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా గన్నవరం కేంద్రాన్ని తీర్చిదిద్దనుంది.
Next Story






