- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
300 అడుగుల మువ్వన్నెల జాతీయ జెండాతో ర్యాలీ.. వావ్ అనాల్సిందే..
భారతీయ మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

దిశ, కారంపూడి : భారతీయ మువ్వన్నెల జెండా గొప్పతనం అందరికీ తెలిసేలా కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. జాతీయ జెండా స్ఫూర్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చింది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కారంపూడిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దాదాపు 300 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారుల కలిసి తహశీల్దార్ కార్యాలయం నుండి కారంపూడి మెయిన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ వాసు, టీడీపీ మండల అధ్యక్షుడు సురేష్ యాదవ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జనసేన సమన్వయ కర్త రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






