- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పి.ఐ.ఓ లకు పనిష్మెంట్
దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వకపోగా కమిషన్ వద్ద విచారణకు సహకరించని పౌర సమాచార అధికారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝులిపించింది.

దిశ ప్రతినిధి, బాపట్ల: దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వకపోగా కమిషన్ వద్ద విచారణకు సహకరించని పౌర సమాచార అధికారులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝులిపించింది. కమిషన్ ఆదేశాలను బుట్ట దాఖలు చేసిన కేసు నంబర్ 0846/202 లో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజా సమాచార అధికారి, కేసు నంబర్ 0862/2023లో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం తహసీల్దార్ కార్యాలయం ప్రజా సమాచార అధికారులకు పదివేల రూపాయలు పెనాల్టీ వేసింది. పెనాల్టీ ప్రభుత్వ ఖజానాకు చెల్లించి, 15 రోజుల లోపల దరఖాస్తుదారునికి యాక్షన్ టేకెన్ రిపోర్టు అందజేసి కమిషన్ కు కంప్లైంట్స్ రిపోర్టు సమర్పించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ శామ్యూల్ జోనాధన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషన్ ఉత్తర్వులు పట్టించుకోకపోవడంతో
గతంలో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ సగిలి షన్ మోహన్ అధికార దుర్వినియోగం, ప్రాణహానికి సంబంధించిన అంశాలపై ఎన్. నాగార్జున రెడ్డి సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం దాఖలు చేసిన అప్పీల్స్ కేసు నంబర్లు 5710/2021, 17430/2023 పై రాష్ట్ర సమాచార కమిషనర్ రవి కుమార్ విచారణ జరిపారు. దీంతో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం తీసుకున్న చర్యలకు సంబంధించి సమాచారం కోరుతూ దరఖాస్తురుడు ఎన్. నాగార్జున రెడ్డి కోరారు. రాష్ట్ర సమాచార కమిషన్ చేపట్టిన విచారణకు పౌర సమాచార అధికారి సహకరించకపోవడంతో ఆ అధికారులపై పనితీరును సరిదిద్దే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వేటపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో మత్స్యకార కుటుంబం వెలివేతను సమర్ధించిన అప్పటి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ సగిలి షన్ మోహన్ పై నమోదైన ఫిర్యాదులపై తీసుకున్న చర్యల తాలూకు సమాచారం కోసం చేసుకున్న దరఖాస్తును పరిష్కరించకపోవడంతో సెక్షన్ 20 ప్రకారం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.






